Skip to main content

పీఎం-కిసాన్ పథకం ప్రారంభం

ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఏటా రూ.6వేలు ఆర్థిక సాయం అందించేందకు ఉద్దేశించిన ప్రధాన మంత్రి రైతు గౌరవ నిధి (పీఎం-కిసాన్) పథకంను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఫిబ్రవరి 24న జరిగిన ఈ కార్యక్రమంలో తొలి విడతగా 1.01 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.2,000ను మోదీ బదిలీ చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... మిగిలిన రైతులకు కూడా త్వరలోనే ఈ మొత్తం అందుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం రూ.75 వేల కోట్లతో ఈ పీఎం-కిసాన్ పథకాన్ని అమలు చేస్తోందనీ పేర్కొన్నారు.

పీఎం-కిసాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సర మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించడం తెలిసిందే.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
పీఎం-కిసాన్ పథకం ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవ రి 24
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : గోరఖ్‌పూర్ప, ఉత్తరప్రదేశ్
Published date : 25 Feb 2019 05:31PM

Photo Stories