పీఎం అవార్డు ప్యానెల్‌కు సిరిసిల్ల కలెక్టర్ ఎంపిక
Sakshi Education
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ డి.కృష్ణ భాస్కర్‌కు అరుదైన అవకాశం లభించింది. 2020లో ప్రధాన మంత్రి అవార్డుకు సంబంధించి సవరణలు, సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటైన ప్యానెల్ కమిటీలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ డి.కృష్ణ భాస్కర్‌కు చోటు దక్కింది.
సుపరిపాలన అందించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 15 జిల్లాల కలెక్టర్లతో ప్యానెల్ కమిటీని నియమించింది. ఇందులో సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌కు చోటు దక్కింది. దక్షిణ భారతదేశం నుంచి నలుగురు కలెక్టర్లకు ఈ అవకాశం వచ్చింది. గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, విద్యాభివృద్ధికి సంబంధించి ప్రధాన మంత్రి అవార్డులో మార్పులు, చేర్పులకు సంబంధించిన సలహాలు, సూచనలను కలెక్టర్ కృష్ణభాస్కర్ ఇవ్వనున్నారు. తెలంగాణ నుంచి కృష్ణభాస్కర్ ఒక్కరికే ఈ అవకాశం రావడం విశేషం.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పీఎం అవార్డు ప్యానెల్‌కు సిరిసిల్ల కలెక్టర్ ఎంపిక
ఎవరు: డి.కృష్ణ భాస్కర్
ఎందుకు: 2020లో ప్రధాన మంత్రి అవార్డుకు సంబంధించి సవరణలు, సలహాలు, సూచనలు ఇచ్చేందుకు..
క్విక్ రివ్యూ:
ఏమిటి: పీఎం అవార్డు ప్యానెల్‌కు సిరిసిల్ల కలెక్టర్ ఎంపిక
ఎవరు: డి.కృష్ణ భాస్కర్
ఎందుకు: 2020లో ప్రధాన మంత్రి అవార్డుకు సంబంధించి సవరణలు, సలహాలు, సూచనలు ఇచ్చేందుకు..
Published date : 30 Jan 2020 05:45PM