పెద్దపల్లి జిల్లాకి స్వచ్ఛభారత్ అవార్డు
Sakshi Education
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకి ‘స్వచ్ఛభారత్ దివాస్ అవార్డు’ లభించింది.
మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేనకు ప్రధాని నరేంద్ర మోదీ అవార్డును ప్రదానం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే-2019లో ఉత్తమ జిల్లాల కేటగిరీలో పెద్దపల్లి జిల్లా జాతీయస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచినందకుగాను ఈ అవార్డు దక్కింది. స్వచ్ఛసర్వేక్షణ్-2019లో భాగంగా దేశంలోని 690 జిల్లాలు, 17,400 గ్రామాల్లో జల్‌శక్తి శాఖ సర్వే నిర్వహించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్వచ్ఛభారత్ దివాస్ అవార్డు విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 30
ఎవరు : పెద్దపల్లి జిల్లా
ఎందుకు : స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే-2019లో జాతీయస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచినందకుగాను
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్వచ్ఛభారత్ దివాస్ అవార్డు విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 30
ఎవరు : పెద్దపల్లి జిల్లా
ఎందుకు : స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే-2019లో జాతీయస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచినందకుగాను
Published date : 01 Oct 2019 05:39PM