పదమూడు కొత్త వంగడాల రూపకల్పన
Sakshi Education
గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పదమూడు కొత్త వంగడాలను రూపొందించారు.
ఈ వంగడాల్లో ఆంధ్రప్రదేశ్ రైతులకు అనుకూలమైనవి 9 రకాలు, దేశ వ్యాప్తంగా అన్నదాతలకు ఉపయోగపడేవి 4 రకాలు ఉన్నాయి. చీడపీడలను తట్టుకోవడంతో పాటు రైతులకు అధిక దిగుబడిని ఇచ్చే ఈ వంగడాలను వచ్చే ఖరీఫ్ నుంచి సాగు చేసుకునేందుకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు జనవరి 1న శాస్త్రవేత్తలు తెలిపారు. రాష్ట్రానికి సిఫార్సు చేసిన వంగడాల్లో వరి, చెరకు, మినుము, వేరుశనగ, రాగి, జొన్న రకాలు ఉన్నాయి. అలాగే జాతీయ స్థాయిలో సాగు చేసేందుకు సిఫార్సు చేసిన వాటిలో వరి, వేరుశనగ, చెరకులో రెండేసి రకాలు ఉన్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పదమూడు కొత్త వంగడాల రూపకల్పన
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : పదమూడు కొత్త వంగడాల రూపకల్పన
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు
Published date : 02 Jan 2019 05:40PM