Skip to main content

పద్మశ్రీ డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు ఇక లేరు

ప్రముఖ రేడియాలజిస్ట్, నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ పద్మశ్రీ డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు(96) ఇకలేరు.
Current Affairs
కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్‌ 16న తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా పెదముత్తేవి గ్రామంలో 1925 జనవరి 25న వ్యవసాయ కుటుంబంలో కాకర్ల జన్మించారు.

కాకర్ల సుబ్బారావు నేపథ్యం...
  • విశాఖలోని ఆంధ్ర వైద్య కళాశాల నుంచి 1950లో వైద్య పట్టాను పొందారు.
  • అమెరికాలో వైద్య పరీక్షలైన అమెరికా రేడియాలజీ బోర్డు పరీక్షల్లో 1955లో ఉత్తీర్ణులై న్యూయార్క్, బాల్టీమోర్‌ నగరాల్లోని ఆసుపత్రుల్లో 1954–1956 వరకు పనిచేశారు.
  • 1956లో స్వదేశం తిరిగి వచ్చి ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. ఆ తర్వాత ఉస్మానియా కళాశాల రేడియాలజీ విభాగం అధిపతిగా పదోన్నతి పొందారు.
  • 1970లో మళ్లీ ఉన్నత చదవుల కోసం అమెరికా వెళ్లి యూకే అందించే ఫెల్లోషిప్‌ ఆఫ్‌ రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ రేడియాలజిస్టు (ఎఫ్‌ఆర్‌సీఆర్‌) పట్టా అందుకున్నారు.
  • 1978లో తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించారు.
  • డాక్టర్‌ కాకర్ల 1985లో హైదరాబాద్‌లోని నిమ్స్‌ తొలి డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. నిమ్స్‌ను అన్ని విభాగాల్లో, వైద్య శిక్షణలో అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లారు.
  • వైద్య రంగానికి ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మశ్రీతో సత్కరించింది. ఆయన పలు పుస్తకాలు రచించడంతోపాటు పలు అంతర్జాతీయ జర్నల్స్‌లో వ్యాసాలు రాశారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ప్రముఖ రేడియాలజిస్ట్, నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్‌ 16
ఎవరు : పద్మశ్రీ డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు(96)
ఎక్కడ : కిమ్స్‌ ఆస్పత్రి, హైదరాబాద్‌
ఎందుకు : అనారోగ్య సమస్యల కారణంగా...
Published date : 19 Apr 2021 11:34AM

Photo Stories