Skip to main content

పద్మ పురస్కారాల ప్రదానం

2019 ఏడాదికిగానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం మార్చి 11న రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగింది.
మొత్తం 112 మందికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలు ప్రకటించగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తాజాగా 47 మందికి ప్రదానం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిగిలిన వారికి మార్చి 16న అవార్డులను అందజేయనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ‘రైతు నేస్తం’ వ్యవస్థాపక అధ్యక్షుడు యడ్లపల్లి వెంకటేశ్వరావు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
పద్మ పురస్కారాల ప్రదానం
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : రాష్ట్రపతి భవన్, ఢిల్లీ
Published date : 12 Mar 2019 03:38PM

Photo Stories