పది ఆయుష్ కేంద్రాలు ప్రారంభం
Sakshi Education
హరియాణాలో ఏర్పాటైన పది ఆయుష్ కేంద్రాలను ఆగస్టు 30న న్యూఢిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
అలాగే ఆయుర్వేద, సిద్ధ తదితర భారతీయ వైద్యవిధానాలకు విశేష సేవలందించిన 12 మంది వ్యక్తుల పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు. వీరిలో గాంధీజీ వ్యక్తిగత వైద్యుడు దిన్‌షా మెహతా తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఆయుష్ కార్యక్రమంలోకి తాజాగా సోవా రిగ్‌పా అనే బౌద్ధ వైద్యవిధానాన్ని చేరుస్తున్నట్లు ప్రకటించారు. ప్రాచీన, ఆధునిక వైద్యవిధానాల మేళవింపుతోనే దేశ ఆరోగ్య రంగం మెరుగుపడగలదని స్పష్టం చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పది ఆయుష్ కేంద్రాలు ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : హరియాణా
క్విక్ రివ్యూ :
ఏమిటి : పది ఆయుష్ కేంద్రాలు ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : హరియాణా
Published date : 31 Aug 2019 05:34PM