Skip to main content

పార్లమెంట్ హాల్‌లో వాజ్‌పేయి చిత్రపటం

పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఏర్పాటుచేసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చిత్రపటాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఫిబ్రవరి 12న ఆవిష్కరించారు.
అనంతరం వాజ్‌పేయి చిత్రపటాన్ని తయారుచేసిన కృష్ణ కన్హయ్యను రాష్ట్రపతి సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ... వాజ్‌పేయి జీవితం అందరికీ ఆదర్శనీయమని అన్నారు. దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాజ్‌పేయి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చిత్రపటం ఆవిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : పార్లమెంట్ సెంట్రల్ హాల్
Published date : 13 Feb 2019 04:49PM

Photo Stories