Skip to main content

పాకిస్తాన్ ప్రధానితో అమెరికా అధ్యక్షుడు భేటీ

పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు.
అమెరికాలోని న్యూయార్క్‌లో సెప్టెంబర్ 23న జరిగిన ఈ సమావేశం సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం చేయడానికి తాను సిద్ధమని పునరుద్ఘాటించారు. అయితే, అందుకు భారత్, పాక్‌లు రెండూ ఒప్పుకోవాలన్నారు. కశ్మీర్ ద్వైపాక్షిక సమస్య అని, మూడో దేశం జోక్యం ఇందులో అవసరం లేదని ఇప్పటికే పలు సందర్భాల్లో భారత్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

9/11 పోరు పొరపాటే: ఇమ్రాన్
అమెరికాలో 9/11ఉగ్ర దాడుల అనంతరం ఉగ్రవాదంపై పోరులో అమెరికాతో కలసి సాగడం పాకిస్తాన్ చేసిన అతిపెద్ద పొరపాటని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. అది గత ప్రభుత్వాలు చేసిన తప్పన్నారు. కశ్మీర్లో కర్ఫ్యూ ఎత్తేయాల్సిందిగా భారత్‌పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి చేయాలని ‘కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్’ కార్యక్రమంలో ఇమ్రాన్ మేధావులను కోరారు. ఆర్టికల్ 370 రద్దుతో ఐరాస తీర్మానాన్ని, సిమ్లా ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని ఆరోపించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌తో భేటీ
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
Published date : 24 Sep 2019 05:48PM

Photo Stories