Skip to main content

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఖాదిర్ కన్నుమూత

పాకిస్తాన్ మాజీ క్రికెటర్, లెగ్ స్పిన్ దిగ్గజం అబ్దుల్ ఖాదిర్ (64) కన్నుమూశారు.
గుండెపోటు కారణంగా పాకిస్తాన్‌లోని లాహోర్‌లో సెప్టెంబర్ 6న తుదిశ్వాస విడిచారు. పాక్ తరఫున 1977-1990 మధ్య కాలంలో 67 టెస్టులు ఆడిన ఖాదిర్ 32.80 సగటుతో 236 వికెట్లు పడగొట్టాడు. 1993 వరకు సాగిన 104 వన్డేల కెరీర్‌లో అతను 132 వికెట్లు కూడా తీశాడు. లెగ్‌స్పిన్ బౌలింగ్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఖాదిర్ ‘గుగ్లీ’కి కూడా ఎంతో ప్రాచుర్యం తీసుకొచ్చాడు. 1987లో ఇంగ్లండ్‌పై ఒక ఇన్నింగ్‌‌సలో ఖాదిర్ 56 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్ తరఫున ఇప్పటికీ ఇదే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కావడం విశేషం. ఖాదిర్ బాటలోనే క్రికెట్‌లోకి అడుగు పెట్టిన అతని నలుగురు కుమారులు కూడా కనీసం ఫస్ట్ క్లాస్ స్థాయిలో ఆడారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : అబ్దుల్ ఖాదిర్ (64)
ఎక్కడ : లాహోర్, పాకిస్తాన్
ఎందుకు : గుండెపోటు కారణంగా
Published date : 07 Sep 2019 05:27PM

Photo Stories