ఒకేసారి ఆరుగురికి జన్మనిచ్చిన టెక్సాస్ మహిళ
Sakshi Education
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనిచ్చి అత్యంత అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది.
టెక్సాస్‌లోని హూస్టన్‌కు చెందిన తెల్మా చియాకా అనే మహిళ మార్చి 15న నలుగురు మగబిడ్డలు, ఇద్దరు ఆడ శిశువులను ప్రసవించింది. శిశువులు తక్కువ బరువుతో పుట్టడంతో వారికి కొంతకాలం అడ్వాన్స్ డ్ చికిత్స కొనసాగుతుందని వైద్యులు చెప్పారు. ఒకేసారి ఆరుగురికి జన్మనివ్వడం 470 కోట్ల ప్రసవాల్లో ఒకరికే సాధ్యమవుతుందని అంచనా.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఒకేసారి ఆరుగురికి జన్మనిచ్చిన మహిళ
ఎప్పుడు : మార్చి 15
ఎవరు : తెల్మా చియాకా
ఎక్కడ : హూస్టన్, టెక్సాస్, అమెరికా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఒకేసారి ఆరుగురికి జన్మనిచ్చిన మహిళ
ఎప్పుడు : మార్చి 15
ఎవరు : తెల్మా చియాకా
ఎక్కడ : హూస్టన్, టెక్సాస్, అమెరికా
Published date : 18 Mar 2019 05:54PM