ఒహాయో నుంచి సెనేట్‌కు ఎన్నికై న తొలి భారతీయ సంతతి అభ్యర్థి?
Sakshi Education
2020 ఉడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన నీరజ్ అంతాని (29) అరుదైన రికార్డు సృష్టించారు.
ఒహాయో రాష్ట్రం నుంచి సెనేట్‌కు ఎన్నికై న తొలి భారతీయ సంతతి అభ్యర్థిగా రికార్డుల్లోకి ఎక్కారు. స్టేట్ రిప్రజెంటేటివ్‌గా వ్యవహరిస్తున్న నీరజ్ రిపబ్లికన్ పార్టీ తరఫున సెనేట్‌కు పోటీ చేశారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి మార్క్ ఫోగెల్‌పై విజయం సాధించారు. రాజకీయ శాస్త్రం పట్టభద్రుడైన నీరజ్ 2014లో 23 ఏళ్ల వయసులోనే ఓహాయో స్టేట్ హౌస్‌కు ఎన్నికై న ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగానూ రికార్డు సృష్టించారు. నీరజ్ తల్లిదండ్రులు 1987లో వాషింగ్టన్‌కు వలస వచ్చారు. ఆ తరువాత మయామీకి తమ నివాసాన్ని మార్చారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఒహాయో నుంచి సెనేట్‌కు ఎన్నికై న తొలి భారతీయ సంతతి అభ్యర్థి
ఎప్పుడు : నవంబర్ 4
ఎవరు : నీరజ్ అంతాని
ఎక్కడ : అమెరికా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఒహాయో నుంచి సెనేట్‌కు ఎన్నికై న తొలి భారతీయ సంతతి అభ్యర్థి
ఎప్పుడు : నవంబర్ 4
ఎవరు : నీరజ్ అంతాని
ఎక్కడ : అమెరికా
Published date : 05 Nov 2020 05:51PM