ఓడీఓపీ పథకంలో భాగంగా కర్నూలు జిల్లా నుంచి ఎంపికైన ఉత్పత్తి?
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండింగ్ కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
ఇందులో భాగంగా ఆయా జిల్లాల్లో ప్రాముఖ్యత ఉన్న ఉత్పత్తులను ఎంపిక చేశారు. జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 13 జిల్లాలకు 13 ఉత్పత్తులను ఎంపిక చేసి.. వాటిని మేడిన్ ఆంధ్రా పేరుతో బ్రాండింగ్ కల్పించనున్నారు.
ఓడీఓపీ సెల్ ఏర్పాటు...
ప్రధాని నరేంద్ర మోదీ వోకల్ ఫర్ లోకల్‌లో భాగంగా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే విధంగా వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్ (ఓడీఓపీ) పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో 13 జిల్లాల్లో సర్వే నిర్వహించి, విశేష ప్రాచుర్యం ఉన్న ఉత్పత్తులను ఎంపిక చేశారు. నాణ్యమైన స్థానిక ఉత్పత్తుల తయారీ, విక్రయం వంటి అంశాల్లో ఉత్పత్తిదారులకు సహకరించేలా ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఓడీఓపీ సెల్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు.
13 జిల్లాల నుంచి ఎంపికైన ఉత్పత్తులు

జిల్లా పేరు | ఎంపిక చేసిన ఉత్పత్తి |
శ్రీకాకుళం | పొందూరు కాటన్ |
విజయనగరం | మామిడి తాండ్ర |
విశాఖపట్నం | ఏటికొప్పాక బొమ్మలు |
తూర్పూ గోదావరి | కొబ్బరి నార ఉత్పత్తులు |
పశ్చిమ గోదావరి | నర్సాపురం లేస్ అల్లికలు |
కృష్ణా | కొండపల్లి బొమ్మలు |
గుంటూరు | ఎండు మిర్చి |
ప్రకాశం | గ్రానైట్ పాలిషింగ్ |
నెల్లూరు | ఉదయగిరి చెక్క నగిషీలు |
చిత్తూరు | పెన్ కలంకారీ |
వైఎస్సార్ | బేరియం, బెరైటీస్ |
కర్నూలు | రాతి శిల్పాలు |
అనంతపురం | రెడిమేడ్ గార్మెంట్స్ |
Published date : 23 Mar 2021 11:39AM