Skip to main content

New Ambulances in AP: అత్యవసర వైద్య సేవ­లు మరింత బలోపేతం

108 అంబులెన్స్‌ సేవలను మరింత బలోపేతం చేసేలా సీఎం జగన్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 146 కొత్త అంబులెన్స్‌­లను కొనుగోలు చేసింది. ఈ అంబులెన్స్‌­లను జులై 3 సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం వద్ద ప్రారంభించారు.
New Ambulances in AP
New Ambulances in AP


ఇందులో భాగంగా అప్పట్లో రూ.96.50 కోట్లతో అధునాతన సౌకర్యాలతో 412 కొత్త అంబులెన్స్‌లు కొనుగోలు చేసి, అప్పటికే ఉన్నవాటికి మరమ్మతులు చేసి 748 అంబులెన్స్‌లతో సేవలను విస్తరించారు. గత అక్టోబర్‌లో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల ప్రజల కోసం రూ.4.76 కోట్లతో ప్రత్యేకంగా 20 అదనపు అంబులెన్సులు కొనుగోలు చేశారు. దీంతో రాష్ట్రంలో అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది.

 Daily Current Affairs in Telugu: 4 జులై 2023 క‌రెంట్ అఫైర్స్

ఎక్కువకాలం ప్రయాణించి దెబ్బతిన్నస్థితిలో ఉన్నవాటి స్థానంలో కొత్త అంబులెన్సులను ప్రవేశపెట్టడం కోసం తాజాగా రూ.34.79 కోట్లతో 146 అంబులెన్స్‌లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. మరోవైపు 108 సేవల కోసం ఏటా ప్రభుత్వం రూ.188.56 కోట్లు ఖర్చు చేస్తోంది. అప్పట్లో 1.19 లక్షల మందికి ఒక అంబులెన్స్‌ ఉండగా ప్రస్తుతం 74,609 మంది జనాభాకు ఒక అంబులెన్స్‌ ఉంది. 

సేవలు వినియోగించుకున్న 33,35,670 మంది:

ప్రస్తుతం రాష్ట్రంలో 108 అంబులెన్స్‌లు రోజుకు 3,089 కేసులకు అటెండ్‌ అవుతున్నాయి. ఇలా 2020 జూలై నుంచి ఇప్పటి వరకు  33,35,670 ఎమర్జెన్సీ కేసుల్లో అంబులెన్స్‌లు సేవలందించాయి. సేవలు వినియోగించుకున్న వారిలో అత్యధికంగా 23%మంది మహిళలే. అనంతరం 12% మంది కిడ్నీ సంబంధిత సమస్యలున్నవారు, 11% మంది రోడ్డు, ఇతర ప్రమాదాల బాధితులు ఉన్నారు.

Daily Current Affairs in Telugu: 1 జులై 2023 క‌రెంట్ అఫైర్స్

Published date : 04 Jul 2023 04:55PM

Photo Stories