నూతన జోనల్ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం
Sakshi Education
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన జోనల్ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ ‘371డి’లోని (1) (2) క్లాజ్‌ల కింద దఖలుపడిన అధికారాలను అనుసరించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్... తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) ఆర్డర్–2018కి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు ఏప్రిల్ 19న కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పోలీసు మినహాయించి మిగిలిన అన్ని విభాగాలకూ ఈ జోన్ల విధానం వర్తిస్తుంది.
Published date : 20 Apr 2021 06:17PM