నటుడు సోనూ సూద్‌కు స్పైస్ జెట్ అరుదైన గౌరవం
Sakshi Education
సినీ నటుడు సోనూ సూద్... కరోనా కష్టకాలంలో ప్రజలకు చేసిన సేవలకు గౌరవంగా దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ బోయింగ్–737 రకం విమానం మీద ఆయన బొమ్మను వేశారు.
ఆ బొమ్మకు ‘ఏ సెల్యూట్ టూ సేవియర్ సోనూసూద్’ అనే క్యాప్షన్‌ను జత చేశారు. ఇలా ఒక దేశీయ విమానయాన సంస్థ సొంత ఖర్చులతో ఒక వ్యక్తికి గౌరవార్థంగా ఇలా చేయడం ఇదే తొలిసారి.
ఢిల్లీ చేరుకున్న కుంభ్ సందేశ్ యాత్ర
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడమే కాకుండా ప్రాముఖ్యతను కొత్త తరానికి చాటిచెప్పడం, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనకు ప్రజలు, మేధావుల నుంచి సలహాలు స్వీకరించేందుకు ప్రారంభమైన.... కుంభ్ సందేశ్ యాత్ర, మిషన్ 5151 బృందం దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టింది. 2021, ఫిబ్రవరి 27న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన యాత్ర 7 రాష్ట్రాల్లో సుమారు 7వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి మార్చి 20న ఢిల్లీకి చేరుకుంది. గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యాత్ర సుమారు 500 పట్టణాల ద్వారా సాగింది.

Published date : 22 Mar 2021 05:55PM