నటుడు కొండలరావుపై పోస్టల్ కవర్ విడుదల
Sakshi Education
ప్రముఖ సినీ నటుడు రావి కొండలరావుపై తపాలా శాఖ ప్రత్యేక పోస్టల్ కవర్‌ను రూపొందించింది.
హైదరాబాద్ డాక్ సదన్‌లో ఫిబ్రవరి 25న జరిగిన కార్యక్రమంలో తపాలా శాఖ తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కె.సంధ్యారాణి ఈ కవర్‌ను విడుదల చేశారు. రావి కొండలరావు సుమారు 600కుపైగా చిత్రాల్లో నటించారు. తాను తీసిన సీరియల్స్‌కు 12 నంది అవార్డులు, 50 కథలకు అవార్డులు అందుకున్నారు. ఆరు జాతీయ భాషల్లోకి ఆయన కథలు అనువాదమయ్యాయి. ఆకాశవాణి కోసం పదేళ్లలో వంద నాటికలు రాసిన ఏకై క రచయితగా పేరొందారు.
ఆదర్శరైతు ఆకేపాటికి సృజనాత్మక రైతు అవార్డు
వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం హస్తవరానికి చెందిన ఆదర్శరైతు ఆకేపాటి వరప్రసాద్‌రెడ్డికి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్‌ఐ) సృజనాత్మక రైతు-2020 అవార్డు లభించింది. 2020 మార్చి 3న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించనున్నారు. దేశవ్యాప్తంగా 47 మంది రైతులు జాతీయస్థాయి అవార్డులకు ఎంపికయ్యారు.

Published date : 26 Feb 2020 05:58PM