Skip to main content

నలుగురు దౌత్యవేత్తలకు దీవాలీ వన్ పురస్కారాలు

శాంతియుత ప్రపంచం కోసం ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో చేసిన కృషికి గాను నలుగురు ప్రముఖ దౌత్యవేత్తలకు ‘ద దీవాలీ- పవర్ ఆఫ్ వన్’ పురస్కారాలు లభించాయి.
Current Affairs ఈ నలుగురిలో కజకిస్తాన్ చెందిన కైరాత్ అబ్దాఖ్‌మ్రనోవ్, సైప్రస్ దౌత్యవేత్త నికోలస్ ఎమ్లియోవ్, స్లొవేకియాకు చెందిన  ఫ్రాంటియెస్క్ రుజికా, ఐరాసలో ఉక్రెరుున్ శాశ్వత ప్రతినిధి వోలోదిమిర్ యెల్‌చెంకో ఉన్నారు. ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. దౌత్యంలో ఆస్కార్‌లుగా పరిగణించే దీవాలీ వన్ అవార్డులను అమెరికాలోని దీవాలీ ఫౌండేషన్ ప్రారంభించింది.
 క్విక్ రివ్యూ   :
 ఏమిటి
 : ద దీవాలీ- పవర్ ఆఫ్ వన్ పురస్కారాలు
 ఎప్పుడు  : డిసెంబర్ 8
 ఎవరు  : కైరాత్ అబ్దాఖ్‌మ్రనోవ్, నికోలస్ ఎమ్లియోవ్, ఫ్రాంటియెస్క్ రుజికా, వోలోదిమిర్ యెల్‌చెంకో
 ఎందుకు : శాంతియుత ప్రపంచం కోసం ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో చేసిన కృషికి గాను
Published date : 09 Dec 2019 05:50PM

Photo Stories