నియంత్రణ రేఖ వాణిజ్యం రద్దు
Sakshi Education
జమూకశ్మీర్, పాక్ ఆక్రమిత కశ్మీర్ మధ్య నడుస్తున్న నియంత్రణరేఖ వాణిజ్యాన్ని ఏప్రిల్ 19 నుంచి రద్దుచేస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది.
ఈ వాణిజ్యమార్గం ద్వారా పాకిస్థాన్‌కు చెందిన అవాంఛనీయ శక్తులు, జాతి వ్యతిరేకులు వాణిజ్యం పేరుతో హవాలా డబ్బు, డ్రగ్‌స, ఆయుధాలను సరిహద్దులను దాటిస్తుండంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. నియంత్రణ రేఖకు ఇరువైపులా ఉన్న స్థానిక ప్రజల ఉత్పత్తుల మార్పిడికి అనువైన వాతావరణ కల్పించడానికి ప్రభుత్వం ఇక్కడ వాణిజ్యానికి అనుమతిచ్చింది. ప్రస్తుతం బారాముల్లా జిల్లాలోని సలాంబాద్; పూంచ్ జిల్లాలోని చక్కన్ దా బాగ్ వద్ద ఉన్న రెండు వాణిజ్య కేంద్రాల ద్వారా వారంలో నాలుగు రోజుల పాటు వ్యాపార లావాదేవీలు జరుగుతూవస్తున్నాయి. డబ్బుతో సంబంధంలేకుండా పూర్తి వస్తుమార్పిడి పద్ధతిలో వాణిజ్యం జరుగుతున్నందున ఎలాంటి సుంకాలు విధించడంలేదు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జమూకశ్మీర్, పాక్ ఆక్రమిత కశ్మీర్ మధ్య నడుస్తున్న నియంత్రణరేఖ వాణిజ్యం రద్దు
ఎప్పుడు : ఏప్రిల్ 18
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : వాణిజ్యం పేరుతో హవాలా డబ్బు, డ్రగ్స్, ఆయుధాలను సరిహద్దులను దాటిస్తున్నందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : జమూకశ్మీర్, పాక్ ఆక్రమిత కశ్మీర్ మధ్య నడుస్తున్న నియంత్రణరేఖ వాణిజ్యం రద్దు
ఎప్పుడు : ఏప్రిల్ 18
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : వాణిజ్యం పేరుతో హవాలా డబ్బు, డ్రగ్స్, ఆయుధాలను సరిహద్దులను దాటిస్తున్నందుకు
Published date : 19 Apr 2019 05:31PM