Skip to main content

నిట్ వరంగల్-తైవాన్ వర్సిటీల మధ్య ఎంఓయూ

నిట్ వరంగల్-తైవాన్ యూనివర్సిటీల మధ్య ఎంఓయూ కుదిరింది. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని నిట్‌లో జూన్ 22న నిర్వహించిన ఇండియా-తైవాన్ వైస్ చాన్స్‌లర్, ప్రెసిడెంట్, డెరైక్టర్ ఫోరమ్-2019 సదస్సు సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది.
బెటర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనలైజేషన్, క్వాలిటీ అష్యూరెన్స్‌ అండ్ ఎంప్లాయిబిలిటీ అనే అంశంతో ఈ సదస్సు జరిగింది. ఎన్‌బీఏ చైర్మన్ ప్రొఫెసర్ కె.కె.అగర్వాల్ సదస్సును ప్రారంభించి మాట్లాడుతూ నిట్ వరంగల్-తైవాన్ మధ్య ఒప్పందంతో విద్యా కేంద్రంగా తెలంగాణ రాణిస్తుందని, వృత్తి నైపుణ్యత విద్యనందిస్తూ ఉద్యోగావకాశాలకు నాంది పలకాలని కోరారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : నిట్ వరంగల్-తైవాన్ వర్సిటీల మధ్య ఎంఓయూ
ఎప్పుడు : జూన్ 22
ఎక్కడ : నిట్, కాజీపేట, వరంగల్ అర్బన్
Published date : 24 Jun 2019 06:25PM

Photo Stories