నిస్సా డైరెక్టర్‌గా సీవీ ఆనంద్ నియామకం
Sakshi Education
తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు చెందిన, ప్రస్తుతం కేంద్ర డిప్యుటేషన్ లో ఉన్న 1991 ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ హైదరాబాద్‌లోని హకీంపేటలో ఉన్న నేషనల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ అకాడమీ (నిస్సా) డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
ఈమేరకు సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) డైరెక్టర్ జనరల్ రాజేశ్ రంజన్ ఆగస్టు 10న ఉత్తర్వులు జారీచేశారు. కొంతకాలంగా సీఐఎస్‌ఎఫ్‌లో డిప్యుటేషన్ పై పని చేస్తున్న ఆనంద్.. ఆ విభాగానికి అంతర్భాగంగా ఉన్న ఎయిర్‌పోర్ట్ సెక్టార్ (సౌత్ వెస్ట్) విభాగానికి ఐజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. తాజా ఉత్తర్వుల మేరకు ఆనంద్.. నిస్సాతో పాటు సీఐఎస్‌ఎఫ్ ఎయిర్‌పోర్ట్ సెక్టార్ ఐజీ బాధ్యతల్ని కూడా అదనంగా నిర్వహించనున్నారు. ఆనంద్ గతంలో హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా, విజయవాడ పోలీస్ కమిషనర్‌గా, నగర ట్రాఫిక్ చీఫ్‌గా, ఉమ్మడి సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా పని చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నేషనల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ అకాడమీ (నిస్సా) డైరెక్టర్‌గా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : సీవీ ఆనంద్క్విక్ రివ్యూ :
ఏమిటి : నేషనల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ అకాడమీ (నిస్సా) డైరెక్టర్‌గా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 10
Published date : 12 Aug 2020 09:48PM