నేవీలో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు
Sakshi Education
భారత నావికా దళంలోని మహిళా ఉద్యోగుల కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఇందుకు సంబంధించిన విధివిధానాలను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నేవీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం మార్చి 17న ఈ మేరకు తీర్పు వెలువరించింది. ‘పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించాలి. వివక్షను అధిగమించేందుకు మహిళలకు అవకాశం కల్పించిన సందర్భాలు చరిత్రలో అనేకం ఉన్నాయి’అని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అజయ్ రస్తోగిలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ)లోని విద్య, న్యాయం, రవాణా విభాగాల్లో ప్రస్తుతం విధులు నిర్వర్తించే వారందరికీ శాశ్వత కమిషన్ వర్తిస్తుందని పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మహిళా ఉద్యోగుల కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటు
ఎప్పుడు : మార్చి 17
ఎవరు : సుప్రీంకోర్టు
ఎక్కడ : భారత నావికా దళం
ఎందుకు : పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించాలని
క్విక్ రివ్యూ :
ఏమిటి : మహిళా ఉద్యోగుల కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటు
ఎప్పుడు : మార్చి 17
ఎవరు : సుప్రీంకోర్టు
ఎక్కడ : భారత నావికా దళం
ఎందుకు : పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించాలని
Published date : 18 Mar 2020 06:16PM