Skip to main content

నాలుగేళ్లకు గాంధీ శాంతి పురస్కారాల ప్రకటన

2015 నుంచి 2018 వరకు నాలుగేళ్ల కాలానికి గాంధీ శాంతి పురస్కారాల విజేతలను కేంద్ర ప్రభుత్వం జనవరి 16న ప్రకటించింది.
2015 ఏడాదికిగాను కన్యాకుమారికి చెందిన వివేకానంద కేంద్ర విజేతగా నిలిచారు. అలాగే 2016 ఏడాదికి అక్షయపాత్ర ఫౌండేషన్, సులభ్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా ఈ అవార్డును గెలుచుకున్నాయి. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందిస్తున్నందుకు అక్షయపాత్రకు, పాకీ పని చేసే వారికి విముక్తి కల్పించినందుకు సులభ్ ఇంటర్నేషనల్‌కు ఈ పురస్కారం దక్కింది. 2017 ఏడాదికి ఏకై అభియాన్ ట్రస్ట్, 2018కి కుష్టు వ్యాధి నిర్మూలన కోసం డబ్ల్యూహెచ్‌వో సౌహార్ద్ర రాయబారిగా ఉన్న యోహీ ససకవాకు అవార్డులను ప్రకటించారు.

గాంధీ సిద్ధాంతాలు, పద్ధతుల ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పు కోసం కృషిచేసే వ్యక్తులు, సంస్థలకు గాంధీ శాంతి పురస్కారం అందిస్తారు. ఈ బహుమతి కింద రూ.కోటితోపాటు ప్రశంసాపత్రం ఇస్తారు. చివరిగా 2014లో ఈ పురస్కారాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు ప్రదానం చేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
నాలుగేళ్లకు గాంధీ శాంతి పురస్కారాల ప్రకటన
ఎప్పుడు : జనవరి 16
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
Published date : 17 Jan 2019 05:44PM

Photo Stories