మ్యూనిక్ జట్టుకు యూఈఎఫ్‌ఏ టైటిల్
Sakshi Education
యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ (యూఈఎఫ్‌ఏ) ప్రతిష్టాత్మక చాంపియన్స్ లీగ్ టోర్నమెంట్ టైటిల్‌ను బయెర్న్ మ్యూనిక్ జట్టు కైవసం చేసుకుంది.
భారత కాలమానం ప్రకారం ఆగస్టు 24న పోర్చుగల్ రాజధాని లిస్బన్ లో జరిగిన ఫైనల్లో బయెర్న్ మ్యూనిక్ (జర్మనీ) జట్టు 1–0 గోల్ తేడాతో పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్‌జీ) జట్టుపై విజయం సాధించింది. ఓవరాల్‌గా చాంపియన్స్ లీగ్ టైటిల్‌ను బయెర్న్ మ్యూనిక్ జట్టు సాధించడం ఇది ఆరోసారి. విజేతగా నిలిచిన బయెర్న్ మ్యూనిక్ జట్టుకు కోటీ 90 లక్షల యూరోలు (రూ. 166 కోట్లు)... రన్నరప్ పీఎస్‌జీ జట్టుకు కోటీ 50 లక్షల యూరోలు (రూ. 131 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూఈఎఫ్‌ఏచాంపియన్స్ లీగ్ టోర్నమెంట్ టైటిల్ విజేత
ఎప్పుడు : ఆగస్టు 24
ఎవరు : బయెర్న్ మ్యూనిక్ జట్టు
ఎక్కడ :లిస్బన్, పోర్చుగల్
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూఈఎఫ్‌ఏచాంపియన్స్ లీగ్ టోర్నమెంట్ టైటిల్ విజేత
ఎప్పుడు : ఆగస్టు 24
ఎవరు : బయెర్న్ మ్యూనిక్ జట్టు
ఎక్కడ :లిస్బన్, పోర్చుగల్
Published date : 25 Aug 2020 04:51PM