ముర్రేకు యూరోపియన్ ఓపెన్ టైటిల్
Sakshi Education
ప్రపంచ మాజీ నంబర్‌వన్, బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రేకు యూరోపియన్ ఓపెన్ టోర్నీ టైటిల్ లభించింది.
బెల్జియంలోని యాంట్‌వర్ప్‌లో అక్టోబర్ 20న ముగిసిన ఈ టోర్నీ ఫైనల్లో ప్రపంచ 243వ ర్యాంకర్ ముర్రే 3-6, 6-4, 6-4తో ప్రపంచ 18వ ర్యాంకర్, మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత వావ్రింకా (స్విట్జర్లాండ్)పై గెలుపొందాడు. విజేత ముర్రేకు 1,09,590 యూరోలు (రూ. 87 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 2017 మార్చిలో దుబాయ్ ఓపెన్ టైటిల్ సాధించాక ముర్రే ఖాతాలో చేరిన తొలి టైటిల్ ఇదే. 2019, జనవరిలో తుంటికి శస్త్ర చికిత్స చేయించుకున్న ముర్రే ఆరు నెలలు ఆటకు దూరంగా ఉన్నాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూరోపియన్ ఓపెన్ టోర్నీ టైటిల్ విజేత
ఎప్పుడు : అక్టోబర్ 20
ఎవరు : ఆండీ ముర్రే
ఎక్కడ : యాంట్‌వర్ప్, బెల్జియం
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూరోపియన్ ఓపెన్ టోర్నీ టైటిల్ విజేత
ఎప్పుడు : అక్టోబర్ 20
ఎవరు : ఆండీ ముర్రే
ఎక్కడ : యాంట్‌వర్ప్, బెల్జియం
Published date : 21 Oct 2019 05:17PM