Skip to main content

ముజిబుర్‌ మాసోలియంను సందర్శించిన ఏకైక విదేశీ ప్రభుత్వ నేత?

బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.
Current Affairs
మార్చి 27న బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో జరిగిన ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, కనెక్టివిటీ, వాణిజ్యం, ఇంధనం, ఆరోగ్య రంగం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. బేటీ సందర్భంగా హసీనాకు 12 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులకు సంబంధించిన ఒక బాక్సును మోదీ బహూకరించారు.

తీస్తా ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం: మోదీ
తీస్తా నదీ జలాల పంపకంపై బంగ్లాదేశ్‌తో కుదుర్చుకున్న ఒప్పందం అమలుకు కట్టుబడి ఉన్నట్లు మోదీ తెలిపారు. ఫెని నదీ జలాల పంపిణీ ముసాయిదాను రూపొందించాలని హసీనాను కోరారు. సిక్కిం(భారత్‌)లో ప్రారంభమయ్యే తీస్తా నది పశ్చిమబెంగాల్‌ గుండా ప్రవహించి బంగ్లాదేశ్‌లో ప్రవేశించడానికి ముందు బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. తీస్తా నదీ జలాల పంపకంపై 2011లో కుదిరిన ఒప్పందం పశ్చిమబెంగాల్‌ సీఎం మమత అభ్యంతరాలతో అమలు కాకుండా నిలిచిపోయింది. భారత్, బంగ్లా దేశాలు 56 నదుల జలాలను పంచుకుంటున్నాయి.

ఏకైక విదేశీ ప్రభుత్వ నేత...
రెండు రోజుల బంగ్లాదేశ్‌ పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ.. తుంగిపరాలోని బంగబంధు, బంగ్లాదేశ్‌ జాతిపిత, దివంగత షేక్‌ ముజిబుర్‌ రహ్మాన్‌ మాసోలియాన్ని సందర్శించి నివాళులర్పించారు. దీంతో ముజిబుర్‌ మాసోలియంను సందర్శించిన ఏకైక విదేశీ ప్రభుత్వ నేతగా మోదీ నిలిచారు. గోపాల్‌గంజ్‌(బంగ్లాదేశ్‌)లోని ఒరకండిలో మతువా వర్గం హిందువుల ఆరాధ్యుడు హరిచంద్‌ ఠాకూర్‌ ఆలయాన్ని, 16వ శతాబ్దం నాటి జెషోరేశ్వరి కాళీ ఆలయాన్ని(బంగ్లాదేశ్‌) కూడా మోదీ సందర్శించారు.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి :
ముజిబుర్‌ మాసోలియంను సందర్శించిన ఏకైక విదేశీ ప్రభుత్వ నేత?
ఎప్పుడు : మార్చి 27
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : తుంగిపరా, బంగ్లాదేశ్‌
ఎందుకు : రెండు రోజుల బంగ్లాదేశ్‌ పర్యటనలో భాగంగా
Published date : 30 Mar 2021 03:01PM

Photo Stories