Skip to main content

మరో రెండుసార్లు అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్‌

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ 2036 వరకు దేశ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఇందుకు సంబంధించిన చట్టంపై ఏప్రిల్‌ 5న ఆయన సంతకం చేశారు.
Current Affairs
పుతిన్‌ ప్రస్తుత పదవీకాలం 2024 వరకు మాత్రమే ఉంది. కాగా, ఆ తర్వాత మరో 12 ఏళ్ల పాటు ఆయనే అధ్యక్షుడిగా కొనసాగేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ రాజ్యాంగ సవరణ ప్రతిపాదనకు మద్దతుగా 2020 జూలైలో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటువేశారు.

రెండు దశాబ్దాలకు పైగా...
68 ఏళ్ల పుతిన్‌.. 2000 సంవత్సరంలో తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి రెండు దశాబ్దాలకు పైగా అధికారంలో కొనసాగుతున్నారు. సోవియట్‌ పాలకుడు జోసెఫ్‌ స్టాలిన్‌ కన్నా ఎక్కువకాలం పాటు పదవిలో కొనసాగారు.

రష్యా...
రాజధాని: మాస్కో; కరెన్సీ: రూబుల్‌
రష్యా అధికార భాష: రష్యన్‌
రష్యా ప్రస్తుత అధ్యక్షుడు: వ్లాదిమిర్‌ పుతిన్‌
రష్యా ప్రస్తుత ప్రధాని: మైఖేల్‌ మిషుస్తిన్‌
Published date : 06 Apr 2021 06:19PM

Photo Stories