మరాఠాలకు రిజర్వేషన్లు సబబే: బాంబే హైకోర్టు
Sakshi Education
మరాఠా వర్గానికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని బాంబే హైకోర్టు సమర్థించింది.
అయితే రిజర్వేషన్లను 16 శాతం బదులు రాష్ట్ర వెనుకబడిన కులాల కమిషన్ సూచించిన విధంగా 12 నుంచి 13 శాతం మధ్యలో ఉండేలా చూడాలని సూచించింది. మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ రంజిత్ మోరే, జస్టిస్ భారతి డాంగ్రేలతో కూడిన ధర్మాసనం జూన్ 27న తుది తీర్పు వెలువరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మరాఠాలకు రిజర్వేషన్లు సబబే
ఎప్పుడు : జూన్ 27
ఎవరు : బాంబే హైకోర్టు
ఎక్కడ : మహారాష్ట్ర
క్విక్ రివ్యూ :
ఏమిటి : మరాఠాలకు రిజర్వేషన్లు సబబే
ఎప్పుడు : జూన్ 27
ఎవరు : బాంబే హైకోర్టు
ఎక్కడ : మహారాష్ట్ర
Published date : 28 Jun 2019 06:13PM