మొబైల్ రేడియేషన్ నుంచి రక్షించేందుకు గోసత్వ కవచ్ చిప్‌ను తయారు చేసిన సంస్థ?
Sakshi Education
మొబైల్ ఫోన్ల రేడియేషన్ నుంచి రక్షించేందుకు ఆవు పేడతో తయారు చేసిన ‘గోసత్వ కవచ్’ అనే చిప్‌ను కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్టీయ్ర కామధేను ఆయోగ్ (ఆర్‌కేఏ) చైర్మన్ వల్లభ్ భాయ్ కథిరియా అక్టోబర్ 13న విడుదల చేశారు.
రాజస్థాన్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌కు చెందిన శ్రీజీ గోశాల ఈ చిప్‌ను అభివృద్ధి చేసింది. ఈ చిప్ వల్ల మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ తగ్గడంతో పాటు ఇతర రోగాల నుంచి రక్షణ ఉంటుందని ఆర్‌కేఏ చైర్మన్ వల్లభ్ తెలిపారు. ఆవు పేడ రేడియేషన్ నుంచి రక్షిస్తుందని శాస్త్రీయంగా నిరూపితమైందని, ఈ చిప్‌ను మొబైల్ ఫోన్లలో వాడవచ్చని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గోసత్వ కవచ్పేరుతో చిప్ అభివృద్ధి
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : శ్రీజీ గోశాల
ఎందుకు : మొబైల్ ఫోన్ల రేడియేషన్ నుంచి రక్షించేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : గోసత్వ కవచ్పేరుతో చిప్ అభివృద్ధి
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : శ్రీజీ గోశాల
ఎందుకు : మొబైల్ ఫోన్ల రేడియేషన్ నుంచి రక్షించేందుకు
Published date : 14 Oct 2020 05:36PM