మణిపూర్ హైకోర్టు సీజేగా నియమితులైన న్యాయమూర్తి?
Sakshi Education
మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్ నియమితులయ్యారు.
సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయన్ను మణిపూర్ హైకోర్టు సీజేగా నియమించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఫిబ్రవరి 12న గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. విధుల్లో చేరినప్పటి నుంచి ఆయన నియామకం అమల్లోకి రానుంది. జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగానూ పనిచేశారు. 2013, మార్చి 25న స్థాపించబడిన మణిపూర్ హైకోర్టు ఇంఫాల్‌లో ఉంది.
మణిపూర్ రాజధాని: ఇంఫాల్
మణిపూర్ ప్రస్తుత గవర్నర్: నజ్మా హెప్తుల్లా
మణిపూర్ ప్రస్తుత ముఖ్యమంత్రి: ఎన్.బిరెన్ సింగ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్
ఎందుకు : సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు

Published date : 13 Feb 2021 05:45PM