మలయాళ కవి అక్కితమ్‌కు జ్ఞానపీఠ్ పురస్కారం
Sakshi Education
సాహిత్యరంగంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ్ ప్రముఖ మలయాళీ కవి అక్కితమ్ అచ్యుతన్ నంబూద్రిని వరించింది.
తెలుగు రచయితలు
ఇప్పటి వరకు ముగ్గురు తెలుగు రచయితలు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వారు..
విశ్వనాథ సత్యనారాయణ (1970)
సి.నారాయణరెడ్డి (1988)
రావూరి భరద్వాజ (2012)
అక్కితమ్‌ను 55వ జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికచేసినట్లు జ్ఞానపీఠ్ ఎంపిక బోర్డు చైర్మన్ ప్రతిభా నవంబర్ 29న ప్రకటించారు. మలయాళ సాహితీవేత్తల్లో ప్రముఖుడైన అక్కితమ్ కేరళలోని పాలక్కడ్ జిల్లాలో గల కుమారనెల్లూర్‌లో 1926, మార్చి 18న జన్మించారు. అక్కితమ్ కవితలతోపాటు నాటకాలు, విమర్శనాత్మక వ్యాసాలు, పిల్లల సాహిత్యం, కథలు, అనువాదాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఇప్పటి వరకు 55 పుస్తకాలు రాశారు. మలయాళీ సాహిత్యంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2017లో పద్మశ్రీ అవార్డు అందించింది. సాహిత్య అకాడమీ అవార్డు, కేరళ సాహిత్య అకాడమీ అవార్డు, కబీర్ సమ్మాన్ వంటి పురస్కారాలను అక్కితమ్ అందుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 55వ జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపిక
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : అక్కితమ్ అచ్యుతన్ నంబూద్రి
క్విక్ రివ్యూ :
ఏమిటి : 55వ జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపిక
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : అక్కితమ్ అచ్యుతన్ నంబూద్రి
జ్ఞానపీఠ్ గురించి...
మనదేశంలో అత్యున్నత సాహితీ పురస్కారం.. జ్ఞాన్‌పీఠ్. దీన్ని ఏటా భారతీయ జ్ఞాన్‌పీఠ్ సంస్థ ప్రదానం చేస్తోంది. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్న 22 భాషలకు సంబంధించిన సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డును అందిస్తారు. మొదటి అవార్డును 1965లో ప్రదానం చేశారు. 1965 నుంచి 1981 వరకు ఒక పుస్తకానికి జ్ఞాన్‌పీఠ్ పురస్కారం ఇచ్చేవారు. 1982 నుంచి ఒక పుస్తకానికి కాకుండా సాహితీ రంగంలో చేసిన సేవకు ఇవ్వడం ప్రారంభించారు. అవార్డు గ్రహీతలకు రూ.11 లక్షల నగదు, సరస్వతీ దేవి కాంస్య విగ్రహం ప్రదానం చేస్తారు.
- తొలి జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత మలయాళ రచయిత జి.శంకర కురుప్ (1965). ‘ఒదక్కుజల్’ అనే పుస్తకానికి ఈ అవార్డు లభించింది.
- జ్ఞాన్‌పీఠ్ అవార్డును అందుకున్న తొలి మహిళ బెంగాలీ రచయిత్రి ఆశాపూర్ణాదేవి (1976). ఆమె రాసిన ‘ప్రథమ్ ప్రతిశ్రుతి’ అనే నవలకు ఈ అవార్డు లభించింది. ఇప్పటి వరకు ఎనిమిది మంది మహిళలకు జ్ఞాన్‌పీఠ్ అవార్డును బహూకరించారు.
తెలుగు రచయితలు
ఇప్పటి వరకు ముగ్గురు తెలుగు రచయితలు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వారు..
విశ్వనాథ సత్యనారాయణ (1970)
సి.నారాయణరెడ్డి (1988)
రావూరి భరద్వాజ (2012)
‘జ్ఞాన్‌పీఠ్’ గ్రహీతలు
సంవత్సరం | గ్రహీత | భాష |
1965 | జి.శంకర కురుప్ | మలయాళం |
1966 | తారాశంకర్ బందోపాధ్యాయ | బెంగాలీ |
1967 | ఉమాశంకర్ జోషి | గుజరాతీ |
1967 | కుప్పాలి వెంకటప్ప పుట్టప్ప (కువెంపు) | కన్నడ |
1968 | సుమిత్రానందన్ పంత్ | హిందీ |
1969 | ఫిరాఖ్ గోరఖ్‌పురి | ఉర్దూ |
1970 | విశ్వనాథ సత్యనారాయణ | తెలుగు |
1971 | బిష్ణు డే | బెంగాలీ |
1972 | రాంధారి సింగ్ దిన్‌కర్ | హిందీ |
1973 | డి.ఆర్.బెంద్రె | కన్నడ |
1973 | గోపీనాథ్ మొహంతి | ఒడియా |
1974 | విష్ణు సఖరాం ఖండేకర్ | మరాఠీ |
1975 | అఖిలన్ | తమిళ్ |
1976 | ఆశాపూర్ణాదేవి | బెంగాలీ |
1977 | కె.శివరాం కారంత్ | కన్నడ |
1978 | సచ్చిదానంద వాత్సాయన్ | హిందీ |
1979 | బీరేంద్ర కుమార్ భట్టాచార్య | అస్సామీస్ |
1980 | ఎస్.కె.పొట్టెక్కాట్ | మలయాళం |
1981 | అమృతా ప్రీతమ్ | పంజాబీ |
1982 | మహాదేవి వర్మ | హిందీ |
1983 | మాస్తి వెంకటేశ అయ్యంగార్ | కన్నడ |
1984 | తక్కజి శివశంకర పిళ్లై | మలయాళం |
1985 | పన్నాలాల్ పటేల్ | గుజరాతీ |
1986 | సచ్చిదానంద రౌత్రాయ్ | ఒడియా |
1987 | విష్ణువామన్ శిర్వాద్కర్ (కుసుమాగ్రజ్) | మరాఠీ |
1988 | సి.నారాయణరెడ్డి | తెలుగు |
1989 | ఖుర్రత్‌లేన్ హైదర్ | ఉర్దూ |
1990 | వినాయక కృష్ణ గోకాక్ | కన్నడ |
1991 | సుభాష్ ముఖోపాధ్యాయ | బెంగాలీ |
1992 | నరేష్ మెహతా | హిందీ |
1993 | సీతాకాంత్ మహాపాత్ర | ఒడియా |
1994 | యు.ఆర్.అనంతమూర్తి | కన్నడ |
1995 | ఎం.టి.వాసుదేవన్ నాయర్ | మలయాళం |
1996 | మహాశ్వేతాదేవి | బెంగాలీ |
1997 | అలీ సర్దార్ జాఫ్రి | ఉర్దూ |
1998 | గిరీష్ కర్నాడ్ | కన్నడ |
1999 | నిర్మల్ వర్మ | హిందీ |
1999 | గురుదయాళ్ సింగ్ | పంజాబీ |
2000 | ఇందిరా గోస్వామి | అస్సామీస్ |
2001 | రాజేంద్ర షా | గుజరాతీ |
2002 | జయకాంతన్ | తమిళ్ |
2003 | విందా కరాందికర్ | మరాఠీ |
2004 | రెహమాన్ రాహి | కశ్మీరీ |
2005 | కున్వర్ నారాయణ్ | హిందీ |
2006 | రవీంద్ర కెలేకర్ | కొంకణి |
2006 | సత్యవ్రత్ శాస్త్రి | సంస్కృతం |
2007 | ఒ.ఎన్.వి.కురుప్ | మలయాళం |
2008 | అక్లాఖ్ మహమ్మద్ ఖాన్ | ఉర్దూ |
2009 | అమర్ కాంత్ | హిందీ |
2009 | శ్రీలాల్ శుక్లా | హిందీ |
2010 | చంద్రశేఖర కంబర | కన్నడ |
2011 | ప్రతిభా రే | ఒడియా |
2012 | రావూరి భరద్వాజ | తెలుగు |
2013 | కేదార్‌నాథ్ సింగ్ | హిందీ |
2014 | బాలచంద్ర నెమాడే | మరాఠీ |
2015 | రఘువీర్ చౌదరి | గుజరాతీ |
2016 | శంఖ ఘోష్ | బెంగాలీ |
2017 | కృష్ణ సోబతీ | హిందీ |
2018 | అమితావ్ ఘోష్ | ఆంగ్లం |
Published date : 30 Nov 2019 05:44PM