మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన
Sakshi Education
తెలంగాణలోని వరంగల్ నగరంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించనున్నారు.
ఈ ఆస్పత్రి భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 21న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... వరంగల్‌లో నిర్మించే మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి టాలెస్ట్ టవర్ ఆఫ్ వరంగల్‌గా ఉండాలన్నారు. ఏడాదిన్నరలోగా ఆస్పత్రి నిర్మాణం పూర్తయ్యేలా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. 24 అంతస్తులతో భారీ భవనాన్ని నిర్మించనున్నారు.
సిద్దిపేట జిల్లా కేంద్రం సిద్దిపేటలో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. జూలై 20న జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ వీటిని ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా కేంద్రం కామారెడ్డిలోనూ జిల్లా కలెక్టరేట్, పోలీసు కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన
ఎప్పుడు : జూన్ 21
ఎవరు : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు
ఎక్కడ : వరంగల్, తెలంగాణ
ఎందుకు : ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు...

Published date : 23 Jun 2021 06:58PM