Skip to main content

మిస్ ఆస్ట్రేలియాగా భారత సంతతి యువతి

మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియా-2019గా భారత సంతతికి చెందిన ప్రియా సెరావో నిలిచింది.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జూన్ 28న జరిగిన అందాల పోటీల్లో 26 ఏళ్ల సెరావో మొత్తం 26 మంది యువతులను వెనక్కినెట్టి మిస్ ఆస్ట్రేలియా కిరీటాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆమె ఈ ఏడాదిలో జరగనున్న మిస్ యూనివర్స్ పోటీల్లో ఆస్ట్రేలియా తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. ఇక వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు చెందిన బెల్లా కాసింబా, విక్టోరియా మారిజానా రద్మానోవిక్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

ప్రియా సెరావ్ భారత్‌లోనే జన్మించింది. అయితే అనంతరం ఆమె కుటుంబం తొలుత ఒమన్‌లో.. తర్వాత దుబాయ్‌లో కొన్నాళ్లు ఉన్నారు. చివరగా ఆమె కుటుంబం ఆస్ట్రేలియాలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. న్యాయవిద్యలో డిగ్రీ పూర్తి చేసిన ప్రియా ప్రస్తుతం మెల్‌బోర్న్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జాబ్స్, ప్రెసింక్ట్స్, అండ్ రీజియన్స్ లో పనిచేస్తున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియా-2019గా భారత సంతతి యువతి
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : ప్రియా సెరావో
ఎక్కడ : మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
Published date : 29 Jun 2019 05:59PM

Photo Stories