మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణం
Sakshi Education
మహారాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి మహా వికాస్ ఆఘాడి(మహారాష్ట్ర ప్రోగ్రెసివ్ ఫ్రంట్) తరఫున శివసేన చీఫ్ ఉద్ధవ్ బాల్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు.
ముంబైలోని శివాజీ పార్క్ గ్రౌండ్‌లో నవంబర్ 28న జరిగిన కార్యక్రమంలో ఉద్ధవ్ ఠాక్రేతో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం శివసేనకు చెందిన ఏక్‌నాథ్ షిండే, సుభాష్ దేశాయి, ఎన్సీపీ నేతలు జయంత్ పాటిల్, ఛగన్ బుజ్‌బల్, కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్ తోరట్, నితిన్ రౌత్‌లతో మంత్రులుగా గవర్నర్ ప్రమాణం చేయించారు. మహారాష్ట్ర శాసన సభలో కానీ, శాసన మండలిలో కానీ సభ్యుడు కాకుండానే ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కాకుండా సీఎంగా ప్రమాణం చేసిన వ్యక్తులు, ఆరు నెలల్లోగా శాసన సభకు కానీ, శాసనమండలికి కానీ ఎన్నిక కావాల్సి ఉంటుంది.
ఉద్ధవ్ ఠాక్రే గురించి...
(చదవండి : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు)
క్విక్ రివ్యూ :
ఏమిటి : మహారాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : శివసేన చీఫ్ ఉద్ధవ్ బాల్ ఠాక్రే
ఎక్కడ : శివాజీ పార్క్ గ్రౌండ్, ముంబై, మహారాష్ట్ర
ఉద్ధవ్ ఠాక్రే గురించి...
- బాల్ ఠాక్రే, మీనా ఠాక్రే దంపతులకు ముంబైలో 1960, జూలై 27న ఉద్దవ్ ఠాక్రే జన్మించారు.
- ఠాక్రే జేజే ఇనిస్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్ కాలేజీలో డిగ్రీ చేశారు. ఆ తరువాత అడ్వర్టైజింగ్ ఏజెన్సీని స్థాపించారు.
- 1989లో శివసేన ప్రారంభించిన పత్రిక ‘సామ్నా’ పత్రికను వెనకుండి నడిపించారు.
- 1990లో ములుంద్‌లోని శివసేన శాఖ సమావేశంలో తొలిసారి రాజకీయాల్లో అడుగుపెట్టారు.
- 2003లో శివసేన వర్కింగ్ ప్రెసిడెంటయ్యారు.
- 2012లో బాల్ ఠాక్రే మరణానంతరం పార్టీని నిలబెట్టుకోవడానికి ఉద్ధవ్ తీవ్ర కృషి చేశారు.
- 2014 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 సీట్లల్లో శివసేన 63 స్థానాలను గెలుచుకుంది.
- 2019 ఎన్నికల్లో 288 సీట్లకు శివసేన 56 స్థానల్లో విజయం సాధించింది.
(చదవండి : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు)
క్విక్ రివ్యూ :
ఏమిటి : మహారాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : శివసేన చీఫ్ ఉద్ధవ్ బాల్ ఠాక్రే
ఎక్కడ : శివాజీ పార్క్ గ్రౌండ్, ముంబై, మహారాష్ట్ర
Published date : 29 Nov 2019 05:41PM