Skip to main content

మెక్సికోపై సుంకాల విధింపు రద్దు

మెక్సికో నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 5శాతం సుంకం విధించాలన్న నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
మధ్య అమెరికా నుంచి అక్రమ వలసదారుల రాకను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని మెక్సికో హామీ ఇవ్వడంతో ఆ దేశంపై సుంకం వడ్డించాలన్న ఆలోచనను విరమించుకుంటున్నట్టు ట్రంప్ చెప్పారు. గత వారం ప్రకటించిన ప్రకారం జూన్ 10 నుంచి మెక్సికో ఉత్పత్తులపై సుంకం విధింపు అమల్లోకి రావలసి ఉంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మెక్సికోపై సుంకాల విధింపు రద్దు
ఎప్పుడు : జూన్ 8
ఎవరు : అమెరికా అధ్యక్షుడ డొనాల్డ్ ట్రంప్
Published date : 10 Jun 2019 05:55PM

Photo Stories