మెక్సికో ఓపెన్ ఏటీపీ–500 టోర్నమెంట్ విజేత?
Sakshi Education
మెక్సికో ఓపెన్ ఏటీపీ–500 టోర్నీ విజేతగా జర్మనీ టెన్నిస్ స్టార్ జ్వెరెవ్ నిలిచాడు.
మెక్సికోలోని అకాపుల్కో నగరంలో మార్చి 21న జరిగిన ఫెనల్లో జ్వెరెవ్ 6–4, 7–6 (7/3)తో సిట్సిపాస్ (గ్రీస్)ను ఓడించాడు. ఓవరాల్‌గా జ్వెరెవ్ కెరీర్‌లో ఇది 14వ సింగిల్స్ టైటిల్. 28 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో సింగిల్స్ చాంపియన్‌గా నిలిచిన తొలి జర్మనీ ప్లేయర్‌గా జ్వెరెవ్ గుర్తింపు పొందాడు. జ్వెరెవ్‌కు 88,940 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 64 లక్షల 41 వేలు)తోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీ విజేత?
దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీ విజేతగా అస్లాన్ కరాత్సెవ్ (రష్యా) నిలిచాడు. మార్చి 21న ఫైనల్లో కరాత్సెవ్ 6–3, 6–2తో క్వాలిఫయర్ లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా)పై గెలిచాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మెక్సికో ఓపెన్ ఏటీపీ–500 టోర్నీ విజేత?
ఎప్పుడు : మార్చి 21
ఎవరు : జర్మనీ టెన్నిస్ స్టార్ జ్వెరెవ్
ఎక్కడ : అకాపుల్కో, మెక్సికో

Published date : 22 Mar 2021 06:00PM