మడగాస్కర్‌లో తట్టు వల్ల 1200 మంది మృతి
Sakshi Education
ఆఫ్రికా దేశమైన మడగాస్కర్‌లో తట్టు (మీజిల్స్) వ్యాధి వల్ల 1200 మందికిపైగా మృతి చెందారు.
ఇప్పటికే 1.15 లక్షకుపైగా తట్టు కేసులు నమోదయ్యాయి. అత్యంత సాంక్రమిక వ్యాధిగా పేరొందిన తట్టు వ్యాప్తిని అడ్డుకునేందుకు 90 నుంచి 95 శాతం వరకూ ఇమ్యూనైజేషన్ జరగాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మడగాస్కర్‌లో కేవలం 58 శాతం మంది మాత్రమే తట్టు నివారణ టీకా వేయించుకున్నారు. తట్టు కేసులు అమెరికాతోపాటు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో పెరుగుతున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తట్టు (మీజిల్స్) వ్యాధి వల్ల 1200 మందిమృతి
ఎప్పుడు : ఏప్రిల్ 14
ఎక్కడ : మడగాస్కర్
క్విక్ రివ్యూ :
ఏమిటి : తట్టు (మీజిల్స్) వ్యాధి వల్ల 1200 మందిమృతి
ఎప్పుడు : ఏప్రిల్ 14
ఎక్కడ : మడగాస్కర్
Published date : 15 Apr 2019 05:49PM