Skip to main content

మాలీ అధ్యక్షుడు ఇబ్రహీం రాజీనామా

ఆఫ్రికా దేశం మాలిలో సైనిక తిరుగుబాటు జరిగింది.
Current Affairs
సైన్య నిర్బంధంతో ప్రస్తుత అధ్యక్షుడు ఇబ్రహీం బౌబకర్‌ కీటా తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో చాలా నెలలుగా ఇబ్రహీం దిగిపోవాలని కోరుతూ అందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా ఆగస్టు 18న సైన్యం తిరుగుబాటు చేసి ఇబ్రహీంను ఇంట్లో నిర్బందించింది. దీంతో ఆయనతోపాటు ప్రధాని బౌబుసిస్సే సైతం రాజీనామా చేశారు. దేశంలో ప్రస్తుతం ఐరాస నేతృత్వంలో 15,600 మంది సైనికులు శాంతిపరిరక్షక విధులు నిర్వహిస్తున్నారు. మాలిలో పరిణామాలపై చర్చించేందుకు ఐరాస భద్రతామండలి సమావేశమైంది.

మాలి రాజధాని: బమాకో
కరెన్సీ: పశ్చిమ ఆఫ్రికా సిఎఫ్‌ఎఫ్రాంక్

క్విక్ రివ్యూ :
ఏమిటి :మాలీఅధ్యక్ష పదవికి రాజీనామా
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : ఇబ్రహీం బౌబకర్‌
ఎందుకు :సైనిక తిరుగుబాటు కారణంగా
Published date : 20 Aug 2020 05:28PM

Photo Stories