మాలి జాతి ఘర్షణల్లో 50 మంది మృతి
Sakshi Education
ఆఫ్రికా దేశమైన మాలిలో జరిగిన జాతి ఘర్షణల్లో 50 మంది మృతి చెందారు.
మాలిలోని ఫులానీ తెగకు చెందిన ఒగౌస్సగౌ గ్రామంపై మార్చి 23న డోగోన్ జాతికి చెందిన వేటగాళ్లు దాడిచేశారు. విచక్షణారహితంగా తుపాకులతో కాల్పులు జరుపుతూ నివాసాలకు నిప్పుపెట్టారు. ఈ దుర్ఘటనలో 50 మంది ఫులానీ తెగప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై మాలి ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ... పశువుల మేత, నీటి విషయంలో ఈ రెండు తెగల మధ్య కొన్నేళ్లుగా ఘర్షణలు కొనసాగుతున్నాయన్నారు. 2019, జనవరిలో చోటుచేసుకున్న ఘర్షణలో డోగోన్ వేటగాళ్లు 37 మంది ఫులానీ ప్రజలను చంపేశారన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతి ఘర్షణల్లో 50 మంది మృతి
ఎప్పుడు : మార్చి 23
ఎక్కడ : ఒగౌస్సగౌ గ్రామం, మాలి
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతి ఘర్షణల్లో 50 మంది మృతి
ఎప్పుడు : మార్చి 23
ఎక్కడ : ఒగౌస్సగౌ గ్రామం, మాలి
Published date : 25 Mar 2019 05:28PM