Skip to main content

ల్యాండింగ్ గేర్ సిస్టమ్స్‌ను రూపొందించిన ప్రభుత్వ సంస్థ?

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ)కు చెందిన ‘‘కాంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్(సీవీఆర్‌డీఈ)’’ అనే సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘‘ల్యాండింగ్ గేర్ సిస్టమ్స్’’ను జనవరి 10న చెన్నైలో నావికా దళానికి అప్పగించారు.
Current Affairs

అలాగే పి-75 జలాంతర్గాముల కోసం రూపొందించిన 18 రకాల హైడ్రాలిక్ లూబ్రికేషన్, ఇంధన ఫిల్టర్లను కూడా సీవీఆర్‌డీఈ భారత నావికాదళానికి అందజేసింది. ఈ రెండింటిని సీవీఆర్‌డీఈ సొంతంగా అభివృద్ధి చేసింది.

ల్యాండింగ్ గేర్ సిస్టమ్స్...

  • మానవ రహిత వైమానిక వాహనాల్లో(యూఏవీ) ఉపయోగిస్తారు.
  • ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా వీటిని తయారు చేశారు.
  • ‘‘తపస్’’ యూఏవీ కోసం మూడు టన్నుల ల్యాండింగ్ గేర్ సిస్టమ్స్, ‘‘స్విఫ్ట్’’ యూఏవీ కోసం ఒక టన్ను సిస్టమ్‌ను సీవీఆర్‌డీఈ రూపొందించింది.
  • ల్యాండింగ్ గేర్ సిస్టమ్స్ అనేవి విమానాలకు ఏర్పాటు చేసే చక్రాల వ్యవస్థలు.
  • యుద్ధ ట్యాంకులు, సాయుధ శకటాలను సీవీఆర్‌డీఈ రూపొందిస్తుంటుంది.
  • సీవీఆర్‌డీఈ కార్యాలయం చెన్నైలో ఉంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : భారత నావికా దళానికి ల్యాండింగ్ గేర్ సిస్టమ్స్ అప్పగింత
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : కాంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్(సీవీఆర్‌డీఈ)
ఎక్కడ : చెన్నై
ఎందుకు : మానవ రహిత వైమానిక వాహనాల(యూఏవీ) కోసం
Published date : 12 Jan 2021 05:52PM

Photo Stories