లైఫ్ సెన్సైస్ విజన్-2030 నివేదిక విడుదల
Sakshi Education
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన లైఫ్ సెన్సైస్ అడ్వైజరీ కమిటీ రూపొందించిన ‘తెలంగాణ లైఫ్ సెన్సైస్ విజన్-2030’ నివేదిక విడుదలైంది.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు నవంబర్ 3న హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ఈ నివేదికను విడుదల చేశారు. తెలంగాణ లైఫ్ సెన్సైస్ కమిటీ చైర్మన్, రెడ్డీస్ ల్యాబ్స్ అధిపతి సతీశ్‌రెడ్డితో పాటు కమిటీలో సభ్యులుగా ఉన్న ఫార్మా కంపెనీల అధిపతులు, నిపుణులు, విద్యాసంస్థల అధిపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. లైఫ్ సెన్సైస్ రంగంలో 2030 నాటికి ప్రపంచ స్థాయిలో అగ్రశ్రేణి క్లస్టర్‌గా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు.
డిజిటల్ నివేదిక విడుదల...
డిజిటల్ మీడియా విభాగం రూపొందించిన ‘డిజిటల్ తెలంగాణ- డిజిటల్ మీడియా ఫర్ ఎఫెక్టివ్ డిజిటల్ మేనేజ్‌మెంట్’నివేదికను మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్‌లో విడుదల చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ లైఫ్ సెన్సైస్ విజన్-2030 నివేదిక విడుదల
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు
ఎక్కడ : ప్రగతిభవన్, హైదరాబాద్

Published date : 04 Nov 2020 05:52PM