ఖనిజ సంపదపై భారత్, బ్రెజిల్ సహకారం
Sakshi Education
ఖనిజ సంపదపై భారత్, బ్రెజిల్ పరస్పర సహకారానికి మార్గం సుగమం అయింది.
ఈ మేరకు రెండు దేశాల మధ్య ఒప్పందం చేసుకోడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 22న ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ వ్యవహారాల కమిటీ ఈ మేరకు తన అంగీకారం తెలిపినట్లు మైన్స్ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
హిందుస్తాన్ ఫ్లోరోకార్బన్స్ మూసివేత
ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ ఫ్లోరోకార్బన్స్ లిమిటెడ్ మూసివేతకూ కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో 88 మంది విధులు నిర్వహిస్తున్నారు. 2013-14 నుంచీ ఈ సంస్థ నష్టాల్లో ఉంది.

Published date : 23 Jan 2020 05:40PM