కరోనాపై పోరుకు 650 కోట్ల డాలర్లు: ఏడీబీ
Sakshi Education
కోవిడ్-19(కరోనా వైరస్)పై పోరుకు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) 650 కోట్ల డాలర్ల (రూ.48,100 కోట్లు)ప్యాకేజీని ప్రకటించింది.
కోవిడ్-19 వైరస్ అతి పెద్ద ప్రపంచ ఉపద్రవంగా మారిపోయిందని ఏడీబీ ప్రెసిడెంట్ మస్సాత్సు అసకవ వ్యాఖ్యానించారు. దీన్ని ఎదుర్కొనడానికి జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో తీవ్రమైన చర్యలు తీసుకోవలసి ఉందని వివరించారు. తమ సభ్య దేశాల తక్షణ అవసరాల నిమిత్తం 650 కోట్ల డాలర్ల ప్యాకేజీని అందిస్తున్నామని మార్చి 18న తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 650 కోట్ల డాలర్ల ప్యాకేజీ ప్రకటన
ఎప్పుడు : మార్చి 18
ఎవరు : ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ)
ఎందుకు : కోవిడ్-19పై పోరుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : 650 కోట్ల డాలర్ల ప్యాకేజీ ప్రకటన
ఎప్పుడు : మార్చి 18
ఎవరు : ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ)
ఎందుకు : కోవిడ్-19పై పోరుకు
Published date : 19 Mar 2020 05:38PM