Skip to main content

కరోనాపై అవగాహన‌కు ఆరోగ్య సేతు యాప్‌

దేశంలో కరోనా వైరస్‌ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది.

Current Affairs


కరోనాను దరి చేరకుండా అడ్డుకునేందుకు రూపొందించిన ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను ఏప్రిల్ 2న ప్రారంభించింది. ఎలక్ట్రానిక్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పరిధిలోని ఈ యాప్ కోవిడ్‌-19 బారిన పడిన వారు మన దగ్గరికి సమీపిస్తే మనల్ని హెచ్చరిస్తుంది. ప్రస్తుతం ఆరోగ్య సేతు యాప్‌ 11 భాషల్లో అందుబాటులో ఉంది. ఈ యాప్‌ కేవలం కొత్త కేసులను గుర్తిస్తుందని, కరోనా సోకిన వ్యక్తికి దగ్గరగా ఉన్న వారికి అప్రమత్తత సందేశాలు పంపిస్తుందని అధికారులు వెల్ల‌డించారు.


ఆరోగ్య సేతు ప్రయోజనాలు..
  • దేశంలో కరోనా కేసుల అప్‌డేట్‌ తెలుసుకోవచ్చు.
  • కరోనా బారిన పడకుండా ఉండేందుకు సహాయపడుతుంది
  • కరోనావైరస్ ఉన్న వ్యక్తికి దగ్గరగా వెళ్తే యాప్ మీ లొకేష‌న్ స్కాన్ చేసి.. మీ డేటాను ప్రభుత్వానికి చేర‌వేస్తుంది.
  • కోవిడ్ -19 లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని నిర్థారించ‌డానికి అనేక ప్రశ్నలను అడిగే ప్రత్యేకమైన చాట్‌బోట్ ఉంటుంది.
  • కేంద్ర‌, రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసే ప్రక‌ట‌న‌లు, తీసుకునే చ‌ర్య‌లను తెలియజేస్తుంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఆరోగ్య సేతు యాప్‌ రూప‌క‌ల్పన‌
ఎప్పుడు : ఏప్రిల్ 2
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : కరోనాపై అవగాహన‌కు
Published date : 03 Apr 2020 06:42PM

Photo Stories