Skip to main content

కరోనా వైరస్ కొత్త పేరు కోవిడ్-19

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఫిబ్రవరి 11న కొత్త పేరు పెట్టింది.
Current Affairsఇకపై కరోనాను అధికారికంగా ‘కోవిడ్-19(COVID-19)’గా పిలవనున్నారు. ఇందులో సీ అక్షరం కరోనాను, వీ అక్షరం వైరస్‌ను, డీ అక్షరం డిసీజ్ (జబ్బు)ను, 19ని.. వ్యాధిని కనుగొన్న 2019కి సూచనగా పెట్టారు. ఈ కొత్త పేరు విషయమై డబ్ల్యూహెచ్‌వో అధ్యక్షుడు టెడ్రోస్ అధనోమ్ మాట్లాడుతూ... ‘‘కరోనా అనే పేరు దానికి చెందిన కొన్ని వైరస్‌ల సమూహాన్ని సూచిస్తుంది. దీంతో ఈ పేరుపై గందరగోళాన్ని తొలగించేందుకు పరిశోధకులు ఈ అధికారిక పేరును పెట్టారు. ఈ కొత్త పేరు ఒక భూభాగాన్ని గానీ, ఒక జంతువును గానీ, ఒక స్వతంత్ర జాతిని గానీ సూచించదు. ఈ పేరు ఆ వ్యాధిని తెలియజేస్తుంది’’ అని వెల్లడించారు.

1,016 మంది మృత్యువాత
చైనా ఆరోగ్య శాఖ అధికారుల సమాచారం మేరకు ఫిబ్రవరి 11 నాటికి చైనాలో కరోనా మహమ్మారికి 1,016 మంది మృత్యువాత పడ్డారు. వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయిన వారి సంఖ్య 42,638కి చేరింది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల బృందం ఒకటి బీజింగ్‌ను చేరుకుని వైరస్ నిరోధక చర్యల్లో సాయం అందించడం మొదలుపెట్టింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
కరోనా వైరస్ కొత్త పేరు కోవిడ్-19
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)
ఎందుకు : వ్యాధి కారక పేరుపై గందరగోళాన్ని తొలగించేందుకు
Published date : 12 Feb 2020 06:00PM

Photo Stories