Skip to main content

కరోనా నుంచి రక్షణకు డీఆర్‌డీవో బయోసూట్ రూప‌క‌ల్పన

కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్యులు, ఇతర సిబ్బంది ఆ వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు డీఆర్‌డీవో వినూత్న బయోసూట్‌ను రూపొందించింది.
Current Affairs
పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ) సూట్‌ను వివిధ డీఆర్‌డీవో లేబొరేటరీలకు చెందిన శాస్త్రవేత్తలు.. టెక్స్‌టైల్, కోటింగ్, నానోటెక్నాలజీ తదితర సాంకేతికతలను పరిశీలించి వినూత్నమైన కోటింగ్‌ ద్వారా ఈ సూట్‌ తయారుచేశారు. ఈ సూట్‌లను అధిక మొత్తంలో ఉత్పత్తి చేసి, వైద్యులు, ఇతర సిబ్బందిని కరోనా నుంచి కాపాడేందుకు ఎంతగానో శ్రమిస్తున్నట్టు డీఆర్‌డీవో ఏప్రిల్ 2న వెల్లడించింది. కుసుంఘర్‌ ఇండస్ట్రీస్‌ అనే సంస్థ ఈ సూట్‌ తయారీకి సంబంధించిన ముడి సరుకు సహా, కోటింగ్‌ మెటీరియల్‌ ఉత్పత్తి చేయడమే కాకుండా, పూర్తి సూట్‌ను కూడా తయారు చేస్తున్నట్టు వెల్లడించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : బయోసూట్ రూప‌క‌ల్పన
ఎప్పుడు : ఏప్రిల్ 2
ఎవరు : డీఆర్‌డీవో
ఎందుకు : కరోనా నుంచి రక్షణకు

Published date : 03 Apr 2020 06:28PM

Photo Stories