Skip to main content

క‌రోనా క‌ట్టడిపై ఐక్యరాజ్యసమితి తొలిసారి తీర్మానం

కరోనా వైరస్‌పై పోరులో సభ్య దేశాలకు సహకారం అందించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది.
Current Affairsఈ మేర‌కు ‘‘కోవిడ్‌–19 వ్యాధిపై పోరాటానికి ప్రపంచ దేశాల సంఘీభావం’’అన్న పేరుతో రూపొందించిన తీర్మానాన్ని ఐరాస సర్వ ప్రతినిధి సభ ఏప్రిల్ 3న ఆమోదించింది. తీవ్రంగా ప్రాణనష్టం, ఆర్థిక నష్టం కలిగిస్తున్న కోవిడ్‌–19పై యూఎన్‌ తీర్మానాన్ని ఆమోదించడం ఇదే తొలిసారి. మహమ్మారిపై పోరులో ఆయా ఆదేశాలకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అంతర్జాతీయ సహకారాన్ని ఐరాస అందించనుంది. ఈ తీర్మానంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇంకా చర్చించాల్సి ఉంది. ప్రపంచ ప్రజల ఆరోగ్యం, భద్రతపై ఐక్యరాజ్య సమితిలో 193 సభ్య దేశాలు తీవ్ర ఆందోళనతో ఉన్నాయని తీర్మానం పేర్కొంది.

గాలి ద్వారా వ్యాపించదు
కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాపించే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. కరోనా వ్యాధిగ్రస్తుడు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు బయటకు వచ్చే తుంపర్ల ద్వారా మాత్రమే ఈ వైరస్‌ సోకుతుందని తన తాజా మ్యాగజైన్లలో వెల్లడించింది.
Published date : 04 Apr 2020 04:54PM

Photo Stories