Skip to main content

కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఏ జట్టు విజేత నిలిచింది?

ట్రినిడాడ్ అండ్ టొబాగో వేదికగా జరిగిన కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టు టైటిల్ విజేతగా నిలిచింది.
Current Affairs
టోర్నీలో పరాజయమనేదే లేకుండా సాగిన ఈ జట్టు వరుసగా 12వ మ్యాచ్ గెలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 10న జరిగిన ఫైనల్లో ట్రిన్‌బాగో 8 వికెట్ల తేడాతో సెయింట్ లూసియా జూక్స్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జూక్స్ 19.1 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. అనంతరం నైట్‌రైడర్స్ 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 157 పరుగులు సాధించింది. ట్రినిడాడ్ జట్టు సీపీఎల్ టైటిల్ గెలవడం ఇది నాలుగో సారి.

స్వీడన్ జట్టు కోచ్‌గా జాంటీ రోడ్స్
స్వీడన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, ఫీల్డింగ్ దిగ్గజం జాంటీ రోడ్‌‌స నియమితులయ్యారు. ఐపీఎల్‌లో కింగ్‌‌స ఎలెవన్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా ప్రస్తుతం వ్యవహరిస్తున్న 51 ఏళ్ల రోడ్‌‌స... టోర్నీ ముగిసిన వెంటనే కుటుంబంతో సహా స్వీడన్‌లో స్థిరపడనున్నాడు. సఫారీ జట్టు తరఫున జాంటీ 52 టెస్టులు, 245 వన్డేలు ఆడాడు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : యన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)-2020 విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 10
ఎవరు : ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టు
ఎక్కడ : ట్రినిడాడ్ అండ్ టొబాగో
Published date : 11 Sep 2020 05:23PM

Photo Stories