Skip to main content

కోవిడ్ ప్రపంచవ్యాప్త మహమ్మారి: డబ్ల్యూహెచ్‌ఓ

దాదాపు 125 దేశాల్లో వేగంగా విస్తరించిన కరోనా వైరస్ (కోవిడ్-19)ను ప్రపంచవ్యాప్త మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) మార్చి 11న ప్రకటించింది.
Current Affairsపలు దేశాలు ఈ వ్యాధి నియంత్రణకు సరైన చర్యలు తీసుకోవడం లేదని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రెస్ అధానొమ్ గెబ్రియేసుస్ ఆవేదన వ్యక్తం చేశారు. చైనా వెలుపల కరోనా కేసులు 13 రెట్లు పెరిగాయన్నారు. సత్వర చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు ఆయన సూచించారు.

భారత ప్రధానికి బ్రిటన్ పీఎం ఫోన్‌కాల్
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మార్చి 12న భారత ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. కరోనా వైరస్ విసృ్తతిని అడ్డుకునేందుకు ప్రపంచదేశాలు కలసికట్టుగా తీసుకోవాల్సిన చర్యలను చర్చించారు.

యూరప్ దేశాలపై అమెరికా ట్రావెల్ బ్యాన్
కరోనా కల్లోలం నేపథ్యంలో యూకే మినహా ఇతర యూరప్ దేశాల నుంచి అమెరికాలోకి ఎవరూ అడుగుపెట్టవద్దని మార్చి 12న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసాధారణ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 13 నుంచి 30 రోజుల పాటు యూకేయేతర యూరప్ దేశాల వారిపై ఈ నిషేధం ఉంటుందన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
కోవిడ్-19 ప్రపంచవ్యాప్త మహమ్మారి
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)
ఎందుకు : దాదాపు 125 దేశాల్లో వేగంగా విస్తరించినందున
Published date : 13 Mar 2020 05:31PM

Photo Stories