Skip to main content

కోవిడ్ -19 నిరోధానికి రూ. 200 కోట్లు కేటాయింపు

కోవిడ్ -19 (కరోనా వైరస్)పై ప్రజలను ఆందోళనకు గురి చేయాల్సిన అవసరం లేదని, అయితే జాగ్రత్తలు సూచించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
Current Affairsసీఎం జగన్ మార్చి 6న క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విజయవాడ, అనంతపురంలో కోవిడ్ చికిత్సకు ప్రత్యేక వార్డుల నిర్వహణకు రూ.60 కోట్లతోపాటు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రూ.200 కోట్లు విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

తెలంగాణలో ర్యాపిడ్ రెస్పాన్స్...
కోవిడ్ 19ను ఎదుర్కొనేందుకు తెలంగాణ వ్యాప్తంగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేయాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఆ మేరకు రాష్ట్రస్థాయి రెస్పాన్స్ టీమ్స్‌తో పాటు ప్రతి జిల్లాలోనూ ఈ టీంలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా కోవిడ్ పాజిటివ్ కేసుల కాంటాక్టులను గుర్తించడం కోసం 15 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటైంది. అలాగే ప్రతి జిల్లాలోనూ 15 మంది చొప్పున ఈ టీంలు పనిచేస్తాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
కోవిడ్ -19 నిరోధానికి రూ. 200 కోట్లు కేటాయింపు
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Published date : 07 Mar 2020 05:55PM

Photo Stories